ఇది రికార్డు అంటే..ఒక్కడే 271 కొట్టాడు

311
tamilnadu
- Advertisement -

విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల మోత మోగింది. తమిళనాడు జట్టు 50 ఓవర్లలో 506 పరుగులు చేసి రికార్డు సృష్టించగా ఒక్కడే 271 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. తమిళనాడుకు చెంది నారాయణ్‌ జగదీషన్‌ 141 బంతుల్లోనే 271 పరుగులు చేశారు. తమిళనాడు-అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లొ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది.

నారాయణ్ జగదీషన్‌కి తోడు సుదర్శన్ 102 బంతుల్లో 154 పరుగులు చేశాడు. ఇక అనంతరం బ్యాటింగ్‌కి దిగిన అరుణాచల్ ప్రదేశ్‌ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 71 పరుగులకే ఆలౌట్ కావడంతో తమిళనాడు 435 పరుగుల తేడాతో విజయం సాధించింది. సాయి సుదర్శన్, జగదీషన్‌ ఇద్దరూ 416 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే ఈ టోర్నీ నిర్వహణ తీరుపై దినేష్‌ కార్తీక్ అసహనం వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి జట్టును తమిళనాడుకు పోటీగా దించడంపై విమర్శలు చేశాడు.ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది….అలాంటి జట్లను మెయిన్ టీమ్స్‌తో ఆడించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -