జాకిచాన్‌కి ఆస్కార్‌..

239
JACKIE CHAN GETS AN OSCAR
- Advertisement -

హాలివుడ్‌ యాక్షన్‌ సినిమా అంటే ముందుగా ‘జాకిచాన్‌’ గుర్తుకొస్తాడు. మార్షల్ ఆర్ట్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న హాంగ్‌కాంగ్ నటుడు జాకీ చాన్ కల ఎట్టకేలకు నెరవేరింది. 1962లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన అతడు 56 ఏళ్ల తర్వాత, దాదాపు 200 సినిమాల్లో నటించిన తర్వాత తొలిసారిగా ఆస్కార్ అవార్డును గెలుపొందాడు.

JACKIE CHAN GETS AN OSCAR

ఆస్కార్‌ను ముద్దాడాలనే అతడి 23 ఏళ్ల స్వప్నం సాకారమైంది. ఈ సందర్భంగా జాకీచాన్ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. మీ కోసం నేను ఎప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంటాను. కిటికీల నుంచి దూకుతా, నా ఎముకల్ని కూడా విరగొట్టుకుంటా అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడాడు. నవంబర్ 12న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 8వ వార్షిక గవర్నర్ అవార్డును ఆయన స్వీకరించారు. భిన్న కోణాల్లో సినీ రంగానికి జాకీ చాన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ పురస్కారం ఆయనకు లభించింది.

JACKIE CHAN GETS AN OSCAR

జాకిచాన్ హాంకాంగ్‌లో జన్మించాడు. ఇతనికి మార్షల్‌ ఆర్ట్స్‌పై ఉన్న మక్కువే సినిమాల్లో నటింపేలా చేసింది. జాకీచాన్‌ అసలు పేరు ‘ చాన్‌ కాంగ్‌ – సాంగ్‌’. 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే నటించారు. 1962లో సినీ రంగ ప్రవేశం చేసిన జాకీచాన్‌ మృత్యువు అంచుకు వెళ్ళి వచ్చారు. దీంతో తాను ఇకపై యాక్షన్ చిత్రాల్లో నటించనని ప్రకటించాడు. త్వరలోనే కామెడీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తానని ప్రకటించాడు.

JACKIE CHAN GETS AN OSCAR

JACKIE CHAN GETS AN OSCAR

JACKIE CHAN GETS AN OSCAR

JACKIE CHAN GETS AN OSCAR

JACKIE CHAN GETS AN OSCAR

- Advertisement -