నటి మీనా కుటుంబానికి కరోనా..

29

నటి మీనా కుటుంబానికి కరోనా సోకింది. ఈ తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాలని మీనా కోరారు. ‘2022 లో మా ఇంటికి విచ్చేసిన తొలి అతిథి కరోనా. దానికి మా కుటుంబమంతా నచ్చింది. అయినా సరే దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యహరించండి. కరోనాను వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ను చూసిన ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమె కరోనా నుంచి తొందరగా కోరుకోవాలని ఆకాంక్షించారు.

ఇక ఈ నటి గతేడాది ‘దృశ్యం2’ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ భార్యగా నటించారు. అలాగే రజనీకాంత్ ‘అన్నాత్త’ లోనూ ప్రత్యేక పాత్రలో మెరిశారామె. ఈ ఏడాది మోహన్ లాల్ జోడీగా ‘బ్రోడాడీ’ మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు మీనా. దీంతో పాటు ‘రౌడీబేబీ’ తమిళ చిత్రంలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే కెరీర్ పరంగా ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా హ్యాపీగా సాగుతున్న మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడటం బాధాకరం.