గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జబర్దస్త్ వినోద్..

367
jabardasth vinod
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జబర్దస్త్ వినోద్.అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని జబర్దస్త్ వినోద్ అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. సినీ ఆర్టిస్ట్ పొట్టి విజయ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ కాచిగూడ లోని తన నివాసంలో లో మూడు మొక్కలు నాటిండు.అనంతరం మరో ముగ్గురు ( సీరియల్ నటులు అమీరదీప్ , జబర్దస్త్ నటులు కొమరం , మోహన్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -