రోజు నరకం అనుభవిస్తున్నాః జబర్ధస్త్ వినోద్

662
Jabardasth Vinod
- Advertisement -

జబర్ధస్త్ కామెడీ షోలో లేడి గెటప్ లతో బాగా పాపులర్ అయ్యాడు వినోద్. అతను లేడి గెటప్ వేస్తే అచ్చం అమ్మాయిలానే ఉంటాడు. ఇటివలే వినోద్ ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇంటి ఓనర్ అతనిపై దాడి చేయగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను షూటింగ్ కు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం కుదుటపడుతోంది. దాడి జరిగినప్పటి నుంచి నా కన్ను సరిగ్గా కనిపించడం లేదన్నారు. భుజం వద్ద అయిన గాయం తీవ్రంగా వేధిస్తోందన్నాడు. కళ్లపై బలంగా కొట్టడంతో.. ఒక కన్ను చూపు పోయిందని, ఒకే కన్నుతో మేనేజ్ చేయాల్సి వస్తోందని చెప్పాడు. నేను లేడి గెటప్ వేస్తే నాకళ్లతోనే అందం వస్తుంది…ఇప్పుడు ఇక కన్ను చిన్నగా కావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

సరిగ్గా కనిపించకపోవడంతో నాకు చాలా భయం వేస్తోంది. ప్రతిరోజూ అద్దం చూసుకుని ఏడుస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక కన్ను చిన్నగా కావడంతో షూటింగ్ లకు దూరంగా ఉంటున్నట్లు.. మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ లో పాల్గోంటానని చెప్పారు. నాపై దాడి చేసిన వారికి శిక్ష పడేంతవరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు.

- Advertisement -