బాలీవుడ్‌లోకి జబర్దస్త్ వినోదిని..!

1082
jabardasth vinod
- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారంలో రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఇది. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయి. వారిలో ఒకరు జబర్దస్త్ వినోద్ అలియాస్ వినోదిని. మహిళా పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌పై ఇటీవలె ఓ ఇంటికొనుగోలు విషయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన దాడి,సినిమా అవకాశాల గురించి చెప్పారు వినోద్. ప్రస్తుతం బాలీవుడ్‌లో పూనమ్ పాండే సినిమాలో చేస్తున్నానని తెలిపింది. దాడి జరిగే సమయం కంటే కొద్దిరోజుల ముందు నాలుగు రోజుల పాటు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నానని చెప్పారు. త్వరలోనే మళ్లీ డేట్స్ ఇస్తారని చెప్పారు.

తనకు రెండు లవ్ స్టోరీలు ఉన్నాయని 10వ తరగతిలో ఒకరిని ఇంటర్‌లో మరో లవ్ స్టోరీ ఉందన్నారు. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇంకా వివాదం నడుస్తూనే ఉందని చెప్పారు. తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వడమో లేదా ఇచ్చిన డబ్బుకు డబుల్ ఇవ్వాలని వినోద్ డిమాండ్ చేశారు.

- Advertisement -