జబర్ధస్త్ వినోద్‌పై దాడి.. శాంతి స్వరూప్ ఆగ్రహం..

477
Jabardasth Santhi
- Advertisement -

ప్రముఖ టీవీ ఛానల్‌లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పాపులరైన వినోద్‌పై హత్యా యత్నం జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ కాచీగూడ పరిసరాల్లో వినోద్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే తనపై ఇంటి యజమాని హత్యాయత్నం చేశారని వినోద్ ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును విచారిస్తున్నారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్ ప్రస్తుతం నడవలేని, చూడలేని స్థితిలో ఉన్నాడని జబర్దస్త్ మరో నటుడు శాంతి స్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతం వినోద్ చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పూర్తి చేసి, జీవితంలో సెటిల్ అవ్వాలని భావిస్తున్న వేళ ఈ ఘటన జరగడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Jabardasth Vinod

వినోద్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాడని చెప్పుకొచ్చిన శాంతి స్వరూప్, ఇల్లు కొనుక్కుని అతను సెటిల్ అవుతున్నాడని సంబరపడ్డామని, అంతలోనే అతన్ని హత్య చేయాలన్న ప్రయత్నం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వినోద్‌పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును విచారించి వినోద్‌కు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.

- Advertisement -