రెచ్చిపోయిన ‘జబర్దస్త్’టీమ్…!

389
jabardasth team in goa trip
- Advertisement -

జబర్దస్త్ ఖతర్నక్‌ కామెడీ షో అంటూ గురు,శుక్రవారం ప్రసారమయ్యే ఈ ప్రొగ్రాం బుల్లితెరపై కనివినీ ఎరుగని రీతిలో దూసుకుపోతుంది. మొదట్లో జబర్దస్త్‌ ఒకటే ఉండేది కామెడీ చేసే వారు ఎక్కువైన తర్వాత ఏం చేయ్యాల్లో తెలియక ఎక్సట్రా జబర్దస్త్‌ కూడా ఏర్పాటుచేశారు. జబర్దస్త్ స్టేజ్‌ మీద చేసిన వారంత ఇప్పడు ఆర్ధికంగా సెట్‌ అయ్యి సొంత ఇళ్లులు కూడా కొనుకుంటున్నారు. జబర్దస్త్‌ నటీనటులకు సినిమాల్లో కూడా అవకాశలు ఎక్కువగానే వస్తున్నాయి.

jabardasth team in goa trip

తెలుగురాష్ట్రాలతోపాటు ఇతర ప్రపంచదేశాల్లో ఉండే తెలుగువారందరికీ పరిచయమైన ప్రొగ్రామ్‌ జబర్దస్త్‌ కామెడీ షో. తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్‌ టీంకు అంటూ ఓ ప్రత్యేక స్ధానం లభించింది. జబర్దస్త్‌ అనే కామెడీ షో వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నమని కొందరు జబర్దస్త్‌ కామెడీయన్లు అభిప్రాయపడుతున్నారు. జబర్దస్త్‌ అనే ప్రొగ్రాం ద్వార మా దగ్గర ఉన్న నటను ప్రేక్షకులకు చూపిస్తూ ఎంతగానో ఎంట్రైన్‌ చేస్తున్నమని చెబుతున్నారు మరికొందరు. గురు,శుక్రవారల్లో తొమ్మిన్నర అయ్యితే చాలు అందరు ఈ ప్రోగ్రాంకు అతుకుపోతారు. వీళ్లే వీసే పంచ్‌డైలగులు ఎందరినో అకట్టుకుంటాయి.

jabardasth team in goa trip

ఈ ప్రోగ్రామ్‌లో తమ అంద చందాలతో కుర్రకారును మత్తెక్కిస్తారు యాంకర్‌ అనసూయ, రేష్మి వీళ్లిద్దరు ఇండస్ట్రీలో టాక్‌ఆఫ్‌దిటౌన్‌గా నిలిచారు. రేష్మి తెలుగు యాంకరింగ్‌ సరిగ్గా రాకపోయిన జబర్దస్త్‌ కామెడీషోలో భలే స్టేట్‌ అయ్యింది అంటూ అప్పుడప్పడు షోలో పంచ్‌లు కూడా వేస్తారు టీం లీడర్లు. జబర్దస్త్‌ పుణ్యమఅని రేష్మీ ఏకంగా ఐదు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. అనసూయ మాత్రం ఏకంగా సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అక్కినేని నాగార్జునతో ఐటెం సాంగ్‌లో నటించింది. ప్రస్తుతం అనసూయ పలు ఛానల్స్‌లో యాంకర్‌గా బిజీ అయ్యిపోయింది.

jabardasth team in goa trip

ఇప్పటి వరకు ‘జబర్ధస్త్’ ప్రోగ్రామ్ పై ఎన్నో రూమార్లు, డబుల్‌ మీనింగ్‌ డైలగ్‌లు ఉన్నయట్టు వివమర్శలు వచ్చినా…ఈ షోకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మొత్తానికి ఈ షోలో పాల్గొన్న అందరు కూడా బాగా సొమ్ము చేసుకొని ఆర్ధికంగా స్థిరపడ్డారు.

అయితే ఇటీవలే జబర్దస్త్‌ టీమ్స్‌ మొత్తం ఎంజాయి చేయడానికి గోవాకు వెళ్లింది. ఇందులో యాంకర్‌ అనసూయతో పాటు జబర్దస్త్‌ జడ్జ్‌లు నాగబాబు,రోజు కూడా గోవాకు వెళ్లారు. టీంలో ఉన్న వారంతా కలిసి గోవాలో రచ్చరచ్చచేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈఫోటోలో నాగబాబు,రోజ,అనసూయలు కూడా పాల్గొనడం విశేషం.

- Advertisement -