హీరోగా జబర్దస్త్ రాకేష్

63
- Advertisement -

గ్రీన్ ట్రీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ షూటింగ్ పూజా కార్యక్రమము సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. హాస్యనటుడు రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రధారిగా అనన్య హీరోయిన్ గా ప్రారంభమైన ఈ మూవీ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కను నాటి క్లాప్ బోర్డ్ కొట్టి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్.

Also Read:అయోవా – తెలంగాణ మధ్య పరస్పర సహకారం..

ఏపీ మంత్రి రోజా కెమెరా ఆన్ చేయగా తనికెళ్ళ భరణి మొదటి సన్నివేశానికి దర్శకత్వం వహించగా డైలాగ్స్ సాయికుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారులు సాహితీవేత్త MLC దేశపతి శ్రీనివాస్, తనికెళ్ల భరణి , డైలాగ్ కింగ్ సాయి కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు విఎన్ ఆదిత్య గారు , ప్రవీణ అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -