గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ముక్కు అవినాష్..

155
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్.జె.సునీత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్ జూబ్లీహిల్స్ లోని జిఎచెంసి పార్క్‌లో తన సతీమణి అనూజతో కలిసి మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా ముక్కు అవినాష్ అతని సతీమణి అనూజ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

పెళ్లయిన తర్వాత మొదటిసారిగా మొక్కలు నాటుతున్నామని ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు.పెరుగుతున్న పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్న రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం గెటప్ శ్రీను,కెవ్వు కార్తీక్,కిరాక్ ఆర్పీ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు ముక్కు అవినాష్.

- Advertisement -