బుల్లి తెరపై వచ్చే జబర్దస్ద్ షో కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్ . జబర్దస్ద్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. కమెడీయన్ గానే కాకుండా యంకర్ గా కూడా దూసుకుపొతున్నాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఉన్న సమాచారం సుధీర్ హీరోగా త్వరలోనే సినిమా రూపొందనున్నట్లు తెలుస్తుంది.
ఆసినిమాకు కొత్త దర్శకుడు కాకుండా మంచి పేరున్న దర్శకుడే తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రస్తుతం స్ట్రీప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయని..దీనికి సంబంధించిన పూర్తి వివారాలు త్వరలోనే తెలియన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. సుడిగాలి సుధీర్ గతంలో హీరోగా ఓ సినిమా నటించాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు.
ఆ మూవీతో నిరాశ చెందిన సుధీర్ అప్పటినుంచి పెద్దగా ఆసక్తి చూపకుండా..కామెడిపైనే దృష్టి పెట్టాడు. ఈసారి ఓ పెద్ద దర్శకుడే వచ్చి అతనితో సినిమా చేస్తా అనడంతో సుధీన్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కమెడీయన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న సుధీర్ హీరోగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.