బిగ్ బాస్ …వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో తెలుసా!

379
avinash

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 11 ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 17 మంది కంటెస్టెంట్స్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 18వ కంటెస్టెంట్ రానున్నారు. ఈ మేరకు ప్రొమోను విడుదల చేసింది స్టార్ మా.

నేడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా జబర్దస్త్ అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే క్వారంటైన్ పూర్తిచేసుకున్న అవినాష్‌…ఈరోజు హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారని టాక్‌. ఇందుకు సంబంధించి విడుదల చేసిన ప్రొమోలోని వాయిస్‌ అవినాష్‌దేనని టాక్.

ఇక తొలివారం సూర్యకిరణ్ హౌస్ నుండి ఎలిమినేట్ కాగా సాయి పంపన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రెండోవారంలో 9 మంది ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఉండగా వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది తెలియక ముందే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి మరొకరిని పంపించనున్నారు.