గ్రీన్ ఛాలెంజ్‌….మొక్కలునాటిన జబర్దస్త్ అవినాష్‌

289
jabardasth
- Advertisement -

గ్రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జబర్దస్త్ రాకేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడా లో మొక్కలు నాటిన జబర్దస్త్ ముక్కు అవినాష్ మరియు నేహంత్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని ఈ మొక్కలు నాటడం అంటే మాకు చాలా సంతోషం కలుగుతుందని ఒకప్పుడు హైదరాబాదులో ఎక్కడ చెట్టు కనిపించేది కాదని కానీ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్ల తోనే కనిపిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి చేపట్టిన హరిత హారం స్ఫూర్తితో ఈ రోజు నగరం అంతా పచ్చగా మారిపోయిందని మనందరం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే మంచి వాతావరణం అవసరమని కాబట్టి దీన్ని అందరూ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అవినాష్ మరొక ముగ్గురిని ప్రముఖ యాంకర్ రాధ V6 ,ఆదిరే అభి ,కెవ్వు కార్తిక్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మరియు నేహంత్ మరొక ముగ్గురిని నిహారిక కొణిదెల, యోద,యానీమాస్టర్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా పాల్గొన్నారు.

- Advertisement -