మొక్కలు నాటిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్..

324
Punch Prasad
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ మొక్కలు నాటాడు. జబర్దస్త్ హరికృష్ణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మోతినగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం మరో ముగ్గురు ( జబర్దస్త్ నటులు నాగిరెడ్డి , వెంకీ , బాబీ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటానని జబర్దస్త్ పంచ్ ప్రసాద్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -