బిగ్‌బాస్‌ 4.. ఎలిమినేషన్‌ ఎవరో తెలుసా..!

210
Bigg Boss 4 Telugu

తెలుగు ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎపుడెపుడా అని ఎదురు చూసిన బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభం అయింది. బిగ్‌బాస్‌లో ఈ రోజు తొలివారం ఎలిమినేషన్‌కు మొదలు కానుంది. హౌజ్‌ నుంచి ఎవరు బయటికి వెళ్తారనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. అయితే, శనివారం నాటి ఎపిసోడ్‌ను బట్టి సూర్య కిరణ్‌ ఎలిమినేషన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ప్రవర్తనపై ఇంటా, బయటా విమర్శలు వస్తున్నాయి.

ప్రేక్షకుల్లో కూడా ఆయనపై మంచి అభిప్రాయం కలగలేదని సోషల్‌ మీడియాలో కామెంట్లను బట్టి అర్థమవుతోంది. అతన్ని బయటికి పంపించేందు ఓట్లు వేసినట్టు చాలా మంది చెప్తున్నారు. ఇక హోస్ట్‌ నాగార్జున సైతం సూర్య కిరణ్‌ను కాస్త కఠినంగానే మందలించారు. అన్నీ కలగలిసి అతన్ని బయటికి పంపేందుకు రంగం సిద్ధమయ్యేలా చేశాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.