శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ సినిమాకు ఇది రీమేక్. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు వర్షన్‌ను తెరకెక్కించారు. ప్రీమియర్ షో చూసిన వాళ్లు రేటింగ్ ఇచ్చేస్తున్నారు. ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మరో లోకంలోకి తీసుకెళ్తుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
జాను ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా మ్యాజిక్‌ను మాత్రం కచ్చితంగా ఫీలవుతారని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. సమంత, శర్వానంద్ అద్భుతంగా చేశారట. ఫ్లాష్‌బ్యాక్‌లో స్కూల్ ఎపిసోడ్ చాలా బాగుందని చెబుతున్నారు. మొత్తం మీద జానుకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.