జాను టీజర్‌…2 గంటల్లో మిలియన్ వ్యూస్

722
jaanu
- Advertisement -

శర్వానంద్-సమంత హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం జాను. తమిళ మూవీ 96కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేశారు.

ఎడారిలో బైక్ పై శర్వానంద్ సాగడంతో మొదలైన టీజర్‌లో చిన్ననాటి జ్ఞాపకాలు…సమంత-శర్వా మధ్య ఎమోషనల్ సీన్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. చాలా దూరం వెళ్లిపోయావారా అని సమంత అనగానే నువ్వు ఎక్కడ వదిలేశావో అక్కడే ఉన్నానుఉ అంటూ శర్వా చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. కేవలం 2 గంటల్లో మిలియన్ వ్యూస్ సాధించి యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది.

తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులో కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. దిల్‌ రాజ్‌-శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవింద్‌ వసంత ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌.

- Advertisement -