జామ ఆకులతో ఉపయోగాలు తెలుసా!

279
- Advertisement -

సాధారణంగా జామకాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇందులోని పోషకాలు, విటమిన్స్ మన శరీరానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. అయితే కేవలం జామ కాయల వల్లనే కాకుండా జామ ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జామ ఆకులలో పొటాషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను పేస్ట్ గా చేసి మొఖానికి అప్లై చేయడం వల్ల మొఖంపై ఉండే నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. గోరు వెచ్చని నీటితో మొదట మొఖాన్ని శుభ్రంగా కడిగిన తరువాత ఈ జామ ఆకుల పేస్ట్ ను మొఖానికి అప్లై చేసి పది నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి.

ఇలా రోజు చేయడం వల్ల మొఖం కాంతివంతంగా మారడం తో పాటు మొటిమలు, మచ్చలు కూడా మటుమాయం అవుతాయి. ఇక జామ ఆకులను వేడి నీటిలో వేసి తాగడం వల్ల సీజనల్ గా వచ్చే చర్మ వ్యాధులు తగ్గుతాయి. అలాగే జామ ఆకులలో ఉండే పొటాషియం జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది. జామ ఆకులను మెత్తగా ఒక పేస్ట్ లా చేసుకొని జుట్టు కుదుళ్ల వరకు అంటించి.. ఒక్క అయిదు నిముషాలు జుట్టుపై మసాజ్ చేసి అరగంట పాటు అలాగే ఉంచండి.. తేలికపాటి షాంపుతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు అందంగా నిగారింపుగా అవుతుంది.

Also Read: TTD:బ్రేక్ ద‌ర్శ‌నం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్‌

అంతే కాకుండా జుట్టులోను చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇక జామ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నేచురల్ మెడిసన్ ల పనిచేస్తాయి. ఇందులో ఉండే పాలిఫెనల్స్, కెరోటినాయిడ్లు, టామిక్ కెమికల్స్ వివిద రకాల వ్యాధులపై అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇవన్నీ కూడా డయబెటిస్ ను కంట్రోల్ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే జామ ఆకులలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గేలా చూస్తాయి. అంతే కాకుండా జామ ఆకులను తినడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని పలు అద్యయానాలు చెబుతున్నాయి.

- Advertisement -