అందులో వాస్తవం ఉంది:శ్రీయ

453
its true:Shriya
- Advertisement -

ఈ మధ్య కాలం సినీ పరిశ్రమలో పురుషాధిక్యం కొనసాగుతుందని వార్తపై హీరోయిన్‌లు అప్పుడప్పుడూ స్పందిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో అనేక మంది కథానాయికలు స్పందించగా తాజాగా నటీ శ్రీయ తన అభిప్రాయాన్ని వెళ్లగక్కారు. చిత్రపరిశ్రమలో నిజంగానే పురుషాధిక్యం కొనసాగుతోందని ఆమె తెలిపారు.

 its true:Shriya

ఇక శ్రీయ టాలీవుడ్‌లో నటిగా ఆమెకున్న గుర్తింపు గురించి తెలియంది కాదు. ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ అమ్మడుకు అవకాశాలు కాస్త దూరమైనట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే రష్యాకు చెందిన బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా, చాలా సింపుల్‌గా పెళ్లి చేసేసుకున్నారు శ్రీయ.

ఇక ‘పవిత్ర’ లాంటి లేడి ఓరియంటెడ్‌ చిత్రాలు ఒకటి రెండు చేసినా ఆ సినిమాల వల్ల శ్రీయకు పెద్దగా గుర్తింపు రాలేదు. అరవింద్‌స్వామికి ప్రతినాయకిగా నటించిన ‘నరకాసురన్‌’ చిత్రం ఒక్కటే విడుదల కావలసి ఉంది. ఇక ప్రస్తుతానికి టాలీవుడ్‌లో శ్రీయకు అవకాశాలు మాత్రం రావడం లేదట. ఇక పెళ్లి అయిన హీరోయిన్‌ల జాబితాలో తాజాగా చేరిన శ్రీయకు టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయా లేదో చూడాలి.

- Advertisement -