మ‌హేశ్ బాబు ట్వీట్ కు ర‌షీద్ ఖాన్ రీ ట్వీట్….

259
- Advertisement -

నిన్న రాత్రి కోల్ క‌త్తా, హైద‌రాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అంద‌రిని ఆస‌క్తి ప‌రిచిన విష‌యం తెలిసిందే. ఉత్కంఠ బ‌రితంగా జ‌రిగిన పోరులో కోల్ క‌త్తాపై 14 ప‌రుగుల తేడాతో హైదారాబాద్ ఘ‌న విజ‌యం సాధించింది. చ‌క్క‌ని బౌలింగ్, బ్యాటింగ్ తో కోల్ క‌త్తా ప్లేయ‌ర్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు హైద‌రాబాద్ ఆట‌గాళ్లు. నిన్న జ‌రిగిన మ్యాచ్ లో గెలిచిన టీం ఫైన‌ల్ కు వెళ్ల‌నుండ‌టంతో అంద‌రూ ఆస‌క్తిగా మ్యాచ్ ను వీక్షించారు. నిన్న రాత్రి మ్యాచ్ చూసిన హీరో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ర‌షిద ఖాన్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచేత్తాడు. అలాగే సుప్రీమ్ స్టార్ సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ర‌షిద్ ఖాన్ కు ట్వీట్ చేశారు. ర‌షిద్ నీకూ స‌లామ్ అంటూ సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశారు.

rashid khan

అయితే సూప‌ర్ స్టార్ మ‌హేవ్ బాబు చేసిన ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు ఆల్ రౌండ‌ర్ ర‌షిద్ ఖాన్. ధ‌న్య‌వాదాలు బ్రో..మీ సినిమాలు చాలా బాగుంటాయి అని ర‌షీద్ ఖాన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ర‌షీద ఖాన్ కీల‌క పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చాడు. కేవ‌లం 10బంతుల్లోనే 34ప‌రుగులు చేసి మ్యాచ్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అంతేకాకుండా తన అద్భుత‌మైన బౌలింగ్ తో 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఇక రేపు జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ లో చైన్నై తో త‌ల‌ప‌డ‌నుంది హైద‌రాబాద్.

- Advertisement -