యూపీ ఎన్నికలు దేశ రాజకీయాలను మార్చే ఎన్నికలని సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూ రక్షణ కల్పిస్తున్నారు. అదే జవాన్లు ఆత్మహత్య చేసుకునే పరిసితులు కూడా ఉన్నాయంటే బీజేపీ పాలనను అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే బీజేపీ దేశాన్ని ఎక్కడకు తీసుకు పోతోందో అర్థం చేసుకోవాలి అని అన్నారు. అందుకే యువకులు ఎస్సీలో చేరి పార్టీ ఆదర్శాలను ముందుకు తీసుకు పోతున్నారు. అఖిలేష్ రెండోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా శివ్‌పాల్ మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ అధికారంలోకి రావొద్దన్నదే తమ అభిమతమని తెలిపారు. కాగా, ఈ రథ యాత్ర సందర్భంగా ఎస్పీ కార్యకర్తల మధ్య స్వల్ప ఉధ్రిక్తత చోటుచేసుకుంది. అఖిలేష్ వర్గం, శివపాల్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రెండు వర్గాల కార్యకర్తలు కర్రలతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. పరస్పరం తోసుకుని, దూషణలకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మీడియా కెమెరాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
అయితే సభలో పాల్గొన్న ములాయం, శివపాల్, అఖిలేశ్ ఏమీ జరగనట్టే వ్యవహరించారు. శివపాల్ యాదవ్ మాట్లాడుడూ… అఖిలేశ్ రథయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఇదిఇలా ఉండగా వికాస్ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు అఖిలేష్ ప్రత్యేక బస్సును రెడీ చేసుకున్నారు. అఖిలేష్ నిలబడి ప్రచారం చేయడానికి వీలుగా బస్సులో హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. బస్సు చుట్టూ సీసీటీవీ కెమెరాలు, లోపల ఎల్‌సీడీ టీవీలు, సోఫాలు, బెడ్ తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. బస్సుకి ఓవైపు అఖిలేష్ సైకిల్ తొక్కుతున్న ఫొటోను, ముందు భాగంలో సమాజ్‌వాదీ పార్టీ చిహ్నం సైకిల్‌ను అంటించారు. బస్సు వెనక అఖిలేష్ తండ్రి, పార్టీ అధినేత ములాయం సింగ్ ఫొటోలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అఖిలేశ్ బాబాయి శివపాల్ యాదవ్ ఫొటోలు అతికించారు. అఖిలేష్ పాలనలో ప్రవేశపెట్టిన లఖ్‌నవూ మెట్రో, అంబులెన్స్ సేవలు, డయల్ ఎ కాప్.. పథకాల గురించి వివరాలనూ ఈ బస్సుపై ముద్రించారు. అయితే,తొలిరోజే బాబాయ్..అబ్బాయ్ అనుచరులు ఘర్షణకు దిగటంతో ముందుముందు మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
#WATCH: Clash erupted between SP workers in Lucknow ahead of UP CM Akhilesh Yadav's “Vikas Rath Yatra” pic.twitter.com/ZTwFgduVP8
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 3, 2016