దీంట్లో వాస్తవం లేదు-కొరటాల

183
It's not true:Koratala
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా-కైరా అద్వానీ జంటగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’ ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ విషయంలో ఆ మధ్య అనేక వార్తలు వినిపించాయి. అంటే..ఈ సినిమాకు కథ కొరటాల శివ రాసుకోలేదని, ఇతర రచయితల వద్ద డబ్బులిచ్చి కొన్నాడనే వార్తలు వినిపించాయి. ఈ నేపధ్యంలో దీనిపై స్పందించాడు కొరటాల.

It's not true:Koratala

ఆయన ఈ విధంగా స్సందిస్తూ.. నా ఫ్రెండ్ నా రూమ్‌మెంట్ అయిన శ్రీహరి (దర్శకుడు) నాకు చాలా రోజుల క్రితం ఈ సినిమా ఐడియా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. నా ఫ్రెండ్ హీరో ముఖ్యమంత్రి పాత్ర గురించి నాకు చెప్పడంతో ఈ కథను నేను సిద్దం చేసుకున్నానని ఆయన తెలిపారు. నా స్నేహితుడు ఇచ్చిన ఐడియాతో ఈ కథను నా సొంతంగా రాసుకున్నానన్నారు. ఈ స్టోరీకి ఐడియా ఇచ్చిన నా ఫ్రెండ్ పేరును టైటిల్ కార్డులో స్పెషల్‌ థ్యాంక్స్‌ చెబుతూ వేయిస్తున్నానని కొరటాల తెలిపారు. ఈ కథపై వస్తున్న వా్ర్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. ఈ సినిమా ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -