ఇది కేసీఆర్ హవా..50వేల మెజార్టీఖాయం:సైదిరెడ్డి

516
saidireddy
- Advertisement -

హుజూర్ నగర్‌లో కారు జోరుకు ఎదురులేకుండా పోయింది. ప్రతీ రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి 19 వేల మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

హుజుర్‌నగర్ ప్రజలు సీఎం కేసీఆర్‌ని నమ్మారని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. ప్రజలు తనకు పట్టం కట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతిపక్షాలు చెప్పిన ఏ మాటలను నమ్మలేదన్నారు. 40 నుంచి 50 వేల మెజార్టీ దాటుతుందని …తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఉదయం 8 గంటలకు సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్‌లోనే లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత చూపుతున్నారు. లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. తుది ఫలితం మధ్యాహ్నం 12.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది.

- Advertisement -