హిందూపుర్‌ని జిల్లాకేంద్రంగా ప్రకటించాలి: బాలయ్య

44
nbk
- Advertisement -

హిందూపుర్‌ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఏపీ సీఎం జగన్‌ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.

ఉద్యోగుల ఆందోళన నుంచి దృ ష్టిమరల్చేందుకే రాత్రికి రాత్రే కొత్త జిల్లాలను ప్రకటించారని బాలకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులకు ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి హిందూపురం జిల్లా కేంద్రం కోసం పోరాడాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం నీచమైన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.

అంతకు ముందు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పా ర్టీనాయకులతో కలిసి నల్ల కండువా ధరించి పాదయాత్ర నిర్వహించారు.

- Advertisement -