మరో అరుదైన ఫీట్ ముంగిట విరాట్..!

82
kohli
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఫీట్ అందుకోనున్నాడు. వెస్టిండిస్‌తో జరగనున్న సిరీస్‌లో మరో ఆరు పరుగులు జోడిస్తే సొంతగడ్డపై వన్డేల్లో ఐదు వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు విరాట్.

తొలి వన్డేలో కోహ్లీ 6 రన్స్‌ చేస్తే.. 96 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించవచ్చు. సచిన్‌ కూడా వెస్టిండీస్‌పైనే ఈ రికార్డును అందుకోవడం విశేషం. ఇంతకు ముందు సచిన్‌ మాత్రమే ఈ ఫీట్‌ సాధించాడు. అయితే సచిన్‌ ఈ మేలురాయిని చేరుకోవడానికి 121 ఇన్నింగ్సులు ఆడాడు.

వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు ఇది 1000వ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టు కూడా 50 ఓవర్ల ఫార్మాట్‌లో వెయ్యి మ్యాచ్‌లు ఆడలేదు.

- Advertisement -