ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం షూటింగ్ పూర్తి!

46
naresh
- Advertisement -

అల్లరి నరేశ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో సీరియస్ డ్రామాగా తెరకెక్కుతుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

ఈ మూవీలో గిరిజన జాతిలో పుట్టిపెరిగిన వారి జీవితాలను నరేష్ ఏ విధంగా మార్చాడనేది మనకు సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్‌లో చూపించారు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి, వీలైనంత త్వరగా వాటిని కూడా ముగించాలని చూస్తోంది.

నరేష్‌తో పాటు ఆనంది, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -