ఐటీసీ నుండి ఎర్త్స్ పాజిటివ్ చాక్లెట్ వేరియంట్

513
itc
- Advertisement -

జాతీయం, 10 నవంబర్ 2020: దేశంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో చాక్లెట్ రుచులు పంచడంలో ఎంతో మంచిపేరు దక్కించుకున్న ITC లిమిటెడ్‌కు చెందిన ఫాబెల్లె చాక్లెట్స్ ఆవిష్కరిస్తోంది ‘Fabelle La Terre’. ఒక సృజనాత్మకమైన రూపురేఖలతో తయారుచేసిన 100% ఎర్త్ పాజిటివ్ చాక్లెట్. ఈ బ్రాండ్ తమదైన శైలిలో రూపొందించిన ఈ విశిష్టమైన చాక్లెట్ వేరియంట్‌ను దీపావళికి ముందు వర్చువల్ ఈవెంట్ ద్వారా ఆవిష్కరించింది. విశ్వసనీయమైన బ్రాండ్స్ అందించే భద్రత మరియు శుభ్రత కలగలసిన ఉత్పత్తులను ఇష్టపడే వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. Fabelle La Terre ఈ అభిరుచులకు అన్నింటికీ అనుగుణమైనదే కాదు దీని మూలంలో ఒక పర్యావరణ హితమైన ప్రభావాంశం కలగలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఒక ప్రత్యేకమైన వివేచనతో పరిశీలించిన నేపథ్యమే Fabelle La Terre ఆవిర్భావానికి మూలకారణంగా నిలిచింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి ప్రజలకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది. స్వచ్ఛమైన గాలిని పీల్చి, నిర్మలమైన ఆకాశాన్ని అంతా కళ్లారా చూశాం.సహజసిద్ధమైన వాతావరణం అంటే ఎలా ఉంటుందో అందరికీ అనుభవంలోకి వచ్చింది. శుభ్రమైన మరియు పచ్చదనంతో నిండిన ప్రపంచం ప్రాముఖ్యత ఏమిటో అందరికీ అర్ధమైంది. ఇవన్నీ ఆధునిక తరం యువతలో చాలామందికి ఏ మాత్రం పరిచయం లేని అంశాలు. పర్యావరణంలో వస్తున్న మార్పులకు కారణమయ్యే కార్బన్ పదార్ధాల వినియోగాన్ని తగ్గించే మార్గాలు అన్వేషించి, వాటిని అనుసరించడం ద్వారానే భవిష్యత్తు తరాలకు మరింత భరోసా కల్పించే అవకాశం ఉంది. కొత్త ప్రపంచ దృక్పథం ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. వ్యక్తులతో సంస్థలు/వ్యవస్థలు ఇందుకోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడింది.

వినియోగదారుల ప్రాధాన్య సరళిలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని మరియు ఒక సానుకూలమైన దృక్పథంతో ఫాబెల్లె సైతం పర్యావరణ హితమైన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎటువంటి రసాయనాలు లేని పదార్ధాలతో వారిని మెప్పించేందుకు ఎర్త్ పాజిటివ్ చాక్లెట్‌కు రూపమిచ్చింది. Fabelle La Terre ప్రకృతి నుంచి ప్రేరణ పొంది రూపొందించినది. ఈ భూమిని ప్రలైన్ ఫార్మాట్‌లో సరికొత్తగా చూస్తూ కేవలం రెండు సహజసిద్ధ పదార్ధాలతో తయారుచేసింది. అవి కేరళలోని ఇడుక్కి పర్వతాల నుంచి తెచ్చిన ఇండియన్ కొకొవ మరియు కర్ణాటక నుంచి సేకరించిన తేనె. ఈ

చాక్లెట్ 33% తేనెతో నిండిన పూర్తిగా చేతితో తయారుచేసిన 100% ఇండియన్/సింగిల్ ఒరిజిన్ చాక్లెట్. ఈ చాక్లెట్ కాన్సెప్ట్ సింపుల్‌గా ఉన్నప్పటికీ తయారీలో మాత్రం చాలా విశిష్టతలతో కూడుకున్నది. ఎక్కడా ఎలాంటి రాజీ లేని విధంగా పలు దశల్లో, పలు రుచుల సమ్మేళనంగా ఫాబెల్లె యొక్క మాస్టర్ చాక్లెటైర్స్ దీనిని తీర్చిదిద్దారు. ప్రత్యేకమైన మిశ్రమాలతో సాటి లేని రుచి తీసుకురావడంలో వారి సమర్ధతకు ఎంతో గుర్తింపు ఉంది. ఇండియన్ కొకొవా బీన్ కాస్తంత పుల్లగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంకా దానిని రుచి చూశాక ఇంకాస్త వగరుగా, చేదుగానూ కూడా అనిపిస్తుంది. అందుకే దీనిని కర్ణాటక తేనెతో ఎంతో జాగ్రత్తగా సమ్మిళితం చేస్తారు. కర్ణాటక తేనె పసందుగా మరియు సుగంధభరితమైన రుచికి పేరొందింది. ఈ రెండింటి కలయిక రుచిని పరిపూర్ణం చేయడంతో రెండు సహజసిద్ధ గుణాలను సజీవంగా ఉంచుతుంది.

Fabelle La Terre ప్రలైన్ చూసేందుకు భూమికి సంబంధించిన స్వభావంతో కనిపిస్తుంది. పై భాగం 100% డార్క్ చాక్లెట్. ఇది భూ ఉపరితలాన్ని ప్రతిబింబిస్తుంది. దానిలో ద్రవరూపంలో కలిసి ఉండే కొకొవ మరియు తేనెల కలయిక, ఈ గ్రహంపై సమృద్ధిగా ఉండే జలరాశికి ప్రతిబింబం.ఈ భూమి ఉపరితలంపై 3/4 వంతు జలమే నిండి ఉంది. ఇక తేనెకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అది అతి తక్కువ ఉష్ణోగ్రతలోనూ గడ్డ కట్టకుండా ద్రవరూపంలోనే ఉంటుంది. ఒకవేళ రిఫ్రిజిరేటర్‌లో ఉన్నా కూడా అంతే. అన్ని పరిస్థితుల్లో జీవం మనుగడ కొనసాగుతుందనే భావనకు ఈ పదార్ధం ఈ ప్రతీకగాన నిలుస్తుంది.

ఉత్పత్తి తయారీకి అవసరమైన వివిధ దశల్లో కార్బన్ అవశేషాలను తగ్గించేందుకు ఫాబెల్లె గణనీయమైన కృషి చేసింది. కేవలం స్థానిక వనరులు వినియోగించుకోవడం ద్వారా మాత్రమే కాదు, తయారీ & రవాణా వ్యవహారాల్లోనూ కార్బన్ ఉద్గారాలు తగ్గించేవిధంగా ఏర్పాట్లు చేసింది. వీలైనంత తక్కువ పదార్ధాలను వినియోగించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది.. రవాణా దూరం పరంగా చూసుకుంటే మొత్తం మీద మైళ్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. చాక్లెట్ ప్రాసెసింగ్/ మాన్యుఫాక్చరింగ్‌ పద్ధతులను అతి తక్కువ చేయడం/పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంది.. కంపెనీ భారీ ఎత్తున చేపట్టిన అడవుల పెంపకం హరిత శోభను పెంచి కార్బన్ కాలుష్యాన్ని తగ్గిస్తోంది. దీంతోపాటు ప్యాకేజింగ్ మెటీరియల్‌ ఇక్కడి నుంచే సేకరించి వాడింది.

ఈ చాక్లెట్ పర్యావరణానికి ఎంతో మేలు చేసేది మరియు రుచిలో సుసంపన్నమైనది కావడంతో పాటు, ఇది గ్లుటెన్ రహితమైనది, లాక్టోజ్ రహితమైనది,గింజలు లేనిది, ఎలాంటి కృత్రిమ పదార్ధాలు లేనిది. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్ లేవు మరియు ఇది శాకాహార ప్రొడక్ట్ కూడా.ఆవిష్కరణను పురస్కరించుకుని అనూజ్ రస్తోగి, సీఓఓ, చాక్లెట్, కాఫీ, కన్‌ఫెక్షనరీ అండ్ న్యూ కేటగిరీ డెవలప్‌మెంట్ – ఫుడ్స్ ITC లిమిటెడ్,మాట్లాడుతూ, ‘‘అద్వితీయమైన మరియు ఎంతో ప్రత్యేకమైన చాక్లెట్ అనుభూతులను అందించడం అనేది ఫాబెల్లె యొక్క మూల సిద్ధాంతాల్లో ప్రధాన భాగం. ప్రస్తుత పరిస్థితి మనందరిలో కొత్త వివేచనను మేల్కొలిపింది. మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియజేసింది. ఇది మన ఆలోచన మరియు కార్యాచరణలో సుస్థిరంగా ఉండాలి. ‘ఫాబెల్లె ఎర్త్’ ప్రవేశపెట్టడం మన భూమాతకు చేయూతనిచ్చే ప్రయత్నంలో మా మొదటి అడుగు. మా ఈ ప్రయత్నానికి వినియోగదారుల తోడ్పాటు ఉండాలని మేము కోరుకుంటున్నాం’’ అని చెప్పారు.

- Advertisement -