కరోనా కోరల్లో అగ్రరాజ్యాలు..!

356
corona
- Advertisement -

ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో జన్మించి ఇప్పుడు 200 దేశాలపై పంజా విసిరింది. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాలు ఈ మహమ్మారి కొరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇటలీలో కరోనా వైరస్ ప్రభావంతో 11,591 మంది మరణించగా, స్పెయిన్ లో 8,189 మంది మృత్యువాత పడ్డారు. చైనాలో మృతుల సంఖ్య 3,305గా నమోదైంది. పాజిటివ్ కేసులు లక్ష దాటిన అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 3,173. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 1,64,359 కేసులు నమోదు అయ్యాయి

ఇక, ఫ్రాన్స్ లోనూ కరోనా విళయతాండవం ఆడుతోంది. అక్కడ 3,024 మంది ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ లో 2,898 మంది బలయ్యారు. బ్రిటన్ లో 1,408, నెదర్లాండ్స్ లో 864, జర్మనీలో 651 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 8.01 లక్షలకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 38,749 మంది మరణించినట్టు గుర్తించారు.ఇక భారత్ లో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 32 మంది మరణించారు.

- Advertisement -