మానవతకు మారుపేరు సీఎం కేసీఆర్‌..

497
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలికి అలమటించవద్దని, ఎంతటి కష్టం వచ్చినా ఎవరూ పస్తులు పండే దుస్థితి రావద్దనేది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానవతా దృక్పథం. ఆకలి దప్పులు, ఆత్మహత్యలు, వలసలు లేని తెలంగాణను స్వప్నించిన మన కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి, రాష్ట్రంలో పేదలకు జీవన భద్రత కల్పించారు. వారికి బతుకుపై భరోసా ఇచ్చారు. అయితే, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పేదలకు పెద్ద శాపంగా మారింది.

సామాజిక దూరం (సోషల్ డిస్టన్సింగ్) పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని దేశంలో అందరికంటే ముందే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించారు. ఇది మంచి ఫలితం ఇస్తున్నది. అయితే సకలం బంద్ కావడం వల్ల రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు రోజువారీ పని దొరకడం లేదు. దీంతో వారికి కూలీ రావడం లేదు. పేదల కుటుంబాలు పనిలేకపోవడం వల్ల చేతిలో డబ్బులు, కడుపుకు ఆహారం లేని దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

gangula-kamalakar

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న పేదల దీనస్థితిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వంతో అర్థం చేసుకున్నారు. పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశ్యంతో ప్రతీ పేద కుంటుంబంలోని ప్రతీ వ్యక్తికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈ ఉచిత బియ్యం పంపిణీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాస్ట్రం లో 87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.81 కోట్ల మంది లబ్దిదారులకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పస్టం చేసింది. రేషన్ షాపులు ఉదయం, సాయంత్రం అన్నీ వేళలు పనిచేసే విధంగా చర్యలు చేపట్టింది. ఇందుకు గాను ప్రభుత్వం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రూ. 1,103 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.

రేపటి నుంచి ప్రారంభమయ్యే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సామాజిక దూరం పాటించాలనే నియమం ప్రకారం రేషన్ షాపుల వద్ద జనం ఒకేసారి గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలంతా ఒకేసారిగా కాకుండా విడతల వారీగా వచ్చేందుకు వీలుగా రేషన్ కార్డు దారులకు కూపన్లు అందిస్తాము. దానిలో చెప్పిన సమయానికే వచ్చి రేషన్ తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను. చివరి వ్యక్తి వరకు బియ్యం అందించే వరకు రేషన్ షాపులు తెరిచే విధంగా చర్యలు తీసుకున్నాము. ప్రతీ ఒక్కరికీ రేషన్ బియ్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కాబట్టి ఎవరూ తొందరపడవద్దని అభ్యర్థిస్తున్నాను. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం సజావుగా సాగే విధంగా అందరూ సహకరించాలని కోరుతున్నాను.

ప్రతి నెల రెగ్యులర్ గా రేషన్ తీసుకొనే కార్డు దారులకు బయోమెట్రిక్ పద్దతి పాటించనవసారం లేదు. గడిచిన 3 నెలలు తీసుకొని వారికి మాత్రమే బయోమెట్రిక్ పద్దతి పాటించవలసి ఉంటుంది. ప్రతి రేషన్ షాపు వద్ద శుభ్రత పాటించుటకై శానిటైజర్లు, సబ్బు మరియు చేతులు శుభ్రతకై నీటిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

- Advertisement -