- Advertisement -
యూరో 2020 ఫుట్‌బాల్ కప్ విజేతగా నిలిచింది ఇటలీ. 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్..ఇటలీతో తుదిపోరులో ఓడిపోయింది. తొలిసారి 1968లో యూరో కప్‌లో విజేతగా ఇటలీ…రెండోసారి విజేతగా నిలించింది. పెనాల్టీ షూటౌట్‌లో 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై ఇటలీ విజయం సాధించింది.
90 నిమిషాల ఆట వ్యవధిలో ఇటలీ, ఇంగ్లండ్ జట్లు 1-1 స్కోర్ చేశాయి. పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీ 3 గోల్స్ చేసి విజేతగా నిలిచింది. 2018 ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలమైన ఇటలీ….ఆ కసితో అపజయమే లేకుండా దూసుకెళ్లింది. 33 మ్యాచ్‌ల్లో ఇటలీ వరుసగా గెలుస్తూ వచ్చింది. ఇంగ్లండ్, ఇటలీ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇటలీ 11, ఇంగ్లాండ్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
- Advertisement -