స్పెయిన్‌తో షెంగెన్ ఒప్పందం రద్దు చేస్తాం!

2
- Advertisement -

స్పెయిన్‌కు చెందిన ఎన్‌క్లేవ్ (ప్రాంతం) ‘సెయుటా’ (Ceuta)లోకి అక్రమ వలసదారులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పెయిన్‌తో సరిహద్దులు స్వేచ్ఛగా పంచుకునే ‘షెంగెన్ ఒప్పందాన్ని’ తాత్కాలికంగా రద్దు చేయడంతో సహా అత్యవసర చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘X’లో పోస్ట్ చేసిన మెలోని.. సెయుటాలో కనిపిస్తున్న దృశ్యాలు నియంత్రణ లేని అక్రమ వలసలు ఐరోపా సరిహద్దుల భద్రతకు ఎంతటి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయో చెప్పడానికి స్పష్టమైన నిదర్శనం అని పేర్కొన్నారు. ఇటలీ హోం మంత్రి మాటియో పియాంటెడోసితో తాను నేరుగా సంప్రదింపులు జరిపానని దీనిపై అధికారిక ప్రతిస్పందనను సమీక్షించేందుకు భద్రతా వ్యవస్థలు సమావేశమవుతున్నాయని ధృవీకరించారు.

సరిహద్దుల్లో పరిస్థితులు దారుణంగా మారుతుంటే ఇటలీ ఊరికే చూస్తూ ఊరుకోదని ప్రధాని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సమావేశాల నిర్ణయాల ఆధారంగా సరిహద్దులను రక్షించుకోవడానికి ప్రజల భద్రతను కాపాడటానికి ఇటలీ కఠిన చర్యలు తీసుకుంటుందని.. స్పెయిన్‌తో ఉన్న ఓపెన్ బార్డర్ (షెంగెన్) ఒప్పందాన్ని నిలిపివేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. అక్రమ వలసలపై తమ ప్రభుత్వం కఠిన వైఖరితో ఉందన్న ఆమె, మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవడం, వేగవంతమైన బహిష్కరణలు చేయడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి మొరాకో అధికారులతో తమ ప్రభుత్వం సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. అయితే సముద్ర మార్గంలో వచ్చే వలసదారులను తక్షణమే డిపోర్ట్ చేయకుండా అధికారులను నియంత్రిస్తూ స్పెయిన్ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సాంచెజ్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామంపై అంతర్జాతీయంగా కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:ఇంజినీర్లను అవమానిస్తారా?

- Advertisement -