నేటి నుండి ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఈ పెరిగిన మినహాయింపు ద్వారా అనేక మంది పన్ను చెల్లింపు దారులకు ఊరట లభించనుంది.
ఈ నేపథ్యంలో.. రూ. 3 లక్షల నుంచి 6 లక్షల ఆదాయంపై 5%,రూ. 6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10%,రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%,రూ. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను విధించ బడుతుంది.
ఆ తర్వాత రూ. 15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను విధించ బడుతుంది.అంతే కాదు, ఆదాయపు పన్ను చట్టం (IT Act) 1961లోని సెక్షన్ 87A కింద మినహాయింపు రూ.5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచ బడింది.అంటే కొత్త విధానంలో రూ. 7 లక్షల వరకు పన్ను విధానం నుంచి తప్పించుకోవచ్చు.
ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ. 3 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 25 లక్షలకు పెంచ బడింది.గతంలో పాత పన్ను విధానంలో వర్తించే రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పుడు కొత్త పన్ను విధానంలో చేర్చ బడింది.ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానం అవుతుంది.అంటే మీరు ఇంకా పన్ను దాఖలు చేసే పద్ధతిని ఎంచుకోక పోతే, మీరు కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లిస్తారు.
ఇంతకుముందు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంపై 37% సర్‌ఛార్జ్ ఉండేది. ఇప్పుడు దాన్ని 25 శాతానికి తగ్గించారు.అంటే రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఇప్పుడు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ఏప్రిల్ 1, 2023 న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల నుంచి మెచ్యూరిటీ రాబడిపై పన్ను విధించ బడుతుందని ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించారు.మొత్తం ప్రీమియం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న పాలసీ లపై ఈ పన్ను వర్తిస్తుంది.
Also Read:

