- Advertisement -
పన్ను చెల్లింపుదారులకు నిజంగా ఇది శుభవార్త. ఆదాయపు పన్ను సమర్పించడానికి గడువును మరోసారి పెంచింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి రిటర్నులను సెప్టెంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపింది.
వాస్తవానికి రేపటితో ఆదాయపు పన్ను చెల్లించడానికి గడువు చివరి తేదీ కాగా కరోనా సంక్షోభం నేథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్ చెల్లిండానికి గడువును పొడిగించడం ఇది మూడోసారి కావడం విశేషం.
కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగేలా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడగించిందని ఐటీశాఖ ట్విట్టర్‌లో పేర్కొంది.
- Advertisement -