ఆల్ టైం హైకి చేరిన పసిడి…

209
gold price

బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఆల్ టైం హైకి చేరింది పసిడి.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ.55,310కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.370 పెరుగుదలతో రూ.50,740గా ఉంది.

ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెర‌గ‌డంతో రూ.51,500గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.52,700కు చేరింది.

బంగారం ధర పెరగడం వరుసగా ఇది 8వ రోజు కాగా కిలో వెండి ధర 50 రూపాయలు పెరిగి రూ.66,050కు చేరింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం పరుగులు పెట్ట‌డంతో దేశీయంగా ప‌సిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది..