రెండో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు..

4
- Advertisement -

సినీ ప్రముఖులపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారుల ఆరా తీస్తున్నారు.

‘పుష్ప 2’ బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై ఆరా తీశారు ఐటీ అధికారులు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న దిల్‌ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనుంది ఐటీ శాఖ. ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్‌ రాజును తీసుకెళ్లే అవకాశం ఉంది.

Also Read:దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం

- Advertisement -