రేవంత్‌కు ఐటీ షాక్…

338
revanth reddy
- Advertisement -

టీ కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్,కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ,ఈడీ అధికారులు దాడులకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంతో పాటు కొడంగల్‌లోని ఇంటిలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి 15 చోట్ల సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

రేవంత్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్..ప్రస్తుతం కొడంగల్‌లో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. అయినప్పటికీ 11 మంది సభ్యులు గల ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు చేస్తోంది.

ఇవాళ కొడంగల్ నుండి రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టనుండగా ఐటీ దాడులు జరగడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేపుతోంది. ఈ దాడులపై రేవంత్ ఇంకా స్పందించలేదు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన పలు కంపెనీ లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలె జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల కేసులో రేవంత్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు అందించారు. సొసైటీ పరిధిలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు అందటంతో పోలీసులు నోటీ జారీ చేశారు. తాజాగా రేవంత్‌పై ఈడీ దాడులు జరపడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -