“మహర్షి” నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

138
dil-raju

మహర్షి మూవీ నిర్మాతల్లో ఒకరైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు ఆఫీసులో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మించిన మహర్షి మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో దిల్ రాజు ఆఫీసులు సోదాలు హాట్ టాపిక్ గా మారాయి. భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కడంతో బిజినెస్‌, కలెక్షన్లపై ఐటీ ఆధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మొత్తం దిల్ రాజు వద్దే ఉన్నట్టు సమాచారం. అందువల్లే దిల్ రాజు కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే మహర్షి సినిమాకు మొత్తం 130కోట్లు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే రూ. 150కోట్ల వరకూ వచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే ఐటీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తుంది. పెద్ద సినిమాల విడుదలకు ముందు గతంలో కూడా నిర్మాతల ఆఫీసుల్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈమూవీని దిల్ రాజు, అశ్వీనిదత్, పీవీపీలు నిర్మించారు. ఈమూవీలో పూజా హెగ్డె హీరోయిన్ నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు.