రేవంత్‌ ఓటమికి కారణం చెప్పిన అరవింద్ అఘోర..!

673
agora

నరమాంసాన్ని భుజించే తెగగా గుర్తింపు తెచ్చుకున్న సాధువులు అఘోరాలు. శవాలను పీక్కొని తినడం,ఒంటిపై నూలు పొగు లేకుండా సంచరించడం,చూడటానికే భయంకరంగా కనిపించడం,వీరి ఆచార,వ్యవహార శైలే డిఫరెంట్. పుష్కరాలు లేదా కుంభమేళ సమయాల్లో మాత్రమే కనిపించే వీరు మిగితా సమయాల్లో హిమాలయాల్లో సంచరిస్తుంటారు. కానీ ఇలాంటి వారిలో ఆయన కాస్త డిఫరెంట్. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా అరవింద్ అఘోర.తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆయన ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సాధారణంగా అఘోరలంటేనే ఒంటిపై నూలు పోగు ఉండదు కానీ ఆయన మాత్రం బట్టలు ధరిస్తారు. జర్నలిస్టుగా,40 కంపెనీలకు ఫైనాన్స్‌ అడ్వయిజర్‌గా ఉన్న ఆయన అఘోరగా ఎలా మారారనే విషయాలను చెప్పారు. తాను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అని చెప్పిన ఈ అఘోర తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని తన భార్య,పిల్లలను మర్చిపోయా కానీ ఎన్టీఆర్‌ని మర్చిపోలేదన్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌ వారి ప్రయోజనం కోసమే తీసుకున్న సినిమా అన్నారు.ఐ లవ్ ఎన్టీఆర్..జై ఎన్టీఆర్‌ అంటూ ఆయన్ని కొనియాడారు.

కొంతమంది అహోరాలు పిచ్చివాళ్లు,మానసిక స్థితి సరిగా లేదని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఎదుటివారు ఎలా భావిస్తే తాము అలాగే కనిపిస్తామని చెప్పారు. తాను మనిషినేనని చెప్పారు. తనపై ఎంతోమందికి అనుమానాలుండొచ్చు కానీ ఓ అఘోరా ఎలా జీవిస్తాడో అలానే జీవిస్తాను,సత్యాన్ని వీడనని తెలిపారు.

ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడంలో టీడీపీ విఫలమైందన్నారు. వెన్నుపోటు గురించి చెప్పుకోవాలంటే మొదటగా మాట్లాడుకోవాల్సింది నాదేండ్ల భాస్కర్‌ రావు గురించే అన్నారు. సీజనల్‌ హైప్ కోసమే నాదేండ్ల ఎన్టీఆర్‌పై కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో ఆదరణలేని వ్యక్తి నాదేండ్ల అన్నారు.

ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పొగొట్టింది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే అన్నారు. అందుకే ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ నాలాగే తిక్కలోడన్నారు. పవన్ తన లాగే ఆవేశ పరుడన్నారు. మహాత్మగాంధీ,ఇందిరా గాంధీ వెస్ట్ ట్రంప్ బెస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కేసీఆర్ బెస్ట్ లీడర్‌..తన ఫేవరేట్ రాజకీయ నాయకుడన్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదన్నారు. కేటీఆర్‌ బెస్ట్ సన్‌,ఎంపీ కవిత బెస్ట్ డాటర్,హరీష్ బెస్ట్ రిలేటీవ్ అన్నారు. అల్లుడే వెన్నుపోటు పొడిచే ఈ రోజుల్లో మేనల్లుడే మామకు అండగా ఉండటం ఎంతమందికి సాధ్యం అవుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయిందని అవకాశవాద రాజకీయాలు,పార్టీ మారడం వల్లే రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారని చెప్పారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎవరో తెలియదన్నారు.

తప్పని పరిస్ధితుల్లో నరమాంసం భక్షిస్తామాని చెప్పారు. ఎవరికైనా మానాభిమానాలు ఉంటాయని తమను పిచ్చివాళ్లు అనడం సరికాదన్నారు. అఘోరిగా మారిన తర్వాతే జీవితమంటే ఏంటో తెలిసిందన్నారు. చావుని ప్రేమిస్తామని..మేము తాగుబోతులమన్నారు. ఎంతతాగిన ఒక విధంగా ఉంటామన్నారు. అఘోరాలంటే సింహాల్లాంటి వారని చెప్పారు. లేడి అఘోరాలు ఉన్నారని చెప్పిన అరవింద్ ఈ ప్రపంచానికి తెలియని రహాస్యాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇంటర్వ్యూ ఇస్తున్నంత సేపు ఆయన మద్యాన్ని సేవిస్తుండటం విశేషం.