- Advertisement -
ఇటీవల ప్రధాని మోదీపై గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఒక డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యెమెంటరీ వైరల్‌గా మారగా దీనిని సోషల్ మీడియా నుండి తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మోడీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
బ్రిటన్ కు చెందిన మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇండియాలోనూ కంపెనీ తన కార్యకలాపాలను వివిధ భాషల్లో నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -