హైటెక్ సిటీలో ఇన్ఫార్మటీక ఆర్ అండ్ డి ఫెసిలిటి సెంటర్‌ను ఈరోజు ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ( HYSEA) ఆర్.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంతకు ముందు అందరూ బెంగళూరు గురించి మాట్లాడుకునేది. ప్రస్తుతం ఐటి సంస్థల చూపు హైదరాబాద్ వైపు ఉంది. ఐ టి సంస్థల స్థాపనకు హైదరాబాద్ ఎంతో సౌకర్యవంతమైంది. 5 ఏండ్లుగా ఐటి రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపనిలన్నీ హైదరాబాద్ లో ప్రారంభమైయ్యాయి అని రంజన్ తెలిపారు.
హైదరాబాద్ కు న్యూ జెర్సీ కు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఫీల్ మర్ఫీ అన్నారు.ఈ ఒప్పందంతో ఐటీ,ఫార్మా,బయోటెక్,మీడియా,ఫిన్ టెక్,డేటా సెంట్రీస్,ఉన్నత విద్య,టూరిజం,ఆరోగ్య రంగాల్లో మరింత పురోగతి సాధించవచ్చని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు.