బంగారం దుకాణాల అక్రమ దందా..ఒక్కరోజు 100 కోట్లు

342
gold shop
- Advertisement -

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరులు తమ డబ్బుని బంగారం రూపంలోకి మార్చుకొని నిల్వ చేసుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్ల వ్యాపారాలపై ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు నిఘా ఉంచారు. ఇందులో భాగంగానే ఐటీ అధికారులు హైదరాబాద్‌లోని కొన్ని బంగారు షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సోదాలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. బంజార హిల్స్‌ లోని  ఓ బంగారం షాపు యాజమాన్యం పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన రాత్రే..దాదాపు 100 కోట్ల లావాదేవీలు జరిపినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

gold shop

ఈ లావాదేవీలు అన్ని పాత కరెన్సీ రూపంలోనే జరిగాయి. బంగారం షాపులోని సీసీ పుటేజ్ ఆధారంగా ఐటీ అధికారులు ఈ గుట్టును కనిపెట్టగలిగారు. అక్రమ బంగారం లావాదేవీలు 100 కోట్ల పైనే ఉండడంతో,,ఐటీ అధికారులు కేసును ఈడీకి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈడీ ఈ కేసును పరిశీలించి..ఇందులో ఎంతమంది పాత్ర ఉందో నిగ్గుతేల్చనున్నారు. నల్లకుబేరులు బ్యాక్ మనీని బంగారం ద్వారా వైట్‌ గా మార్చుకునే ప్రయత్నం చేస్తుండడంతో..ప్రభుత్వం బంగారు షాపులపై నిఘా పెట్టింది. బంగారం కొనుగోలు దారులు తప్పని సరిగా పాన్ కార్డు వివరాలను చెప్పాల్సిందే. లేకపోతే బంగారం దుకాణాలపై చర్యలు తప్పవంటు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే నవంబర్‌ 8 న జరిగే బంగారం కొనుగోలు వివరాలు షాపు యజమానులు తెలియజేయాల్సిందే అంటూ కండిషన్ పెట్టింది.

- Advertisement -