టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు జారీ అయ్యారు. కు రూ.118 కోట్ల మొత్తం వివరాలు ఇవ్వాలని ఐటీ శాఖ హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వెంటనే విచారణను ప్రారంభించడానికి, సెక్షన్ 153C కింద నోటీసు చెల్లుబాటులో జారీ చేయబడింది మరియు ప్రొసీడింగ్‌లు పురోగతిలో ఉన్నాయి ని షోకాజ్ నోటీసులో పేర్కొంది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు షాపూర్జీ పల్లోంజి సంస్థకు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుకు వందల కోట్ల లబ్ది చేకూరింది. ఈ మొత్తం వ్యవహారంలో పల్లోంజి ప్రతినిధిగా మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు తరపున ప్రతినిధిగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ద్వారా చంద్రబాబుకు డబ్బులు చేరాయని గుర్తించారు అధికారులు.
టీడీపీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలోనే ఐటీ శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read:#SK21 కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి