నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-49

215
pslv c49
- Advertisement -

2020లో ఇస్రో తొలి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు శ్రీహరికోట వేదికగా ఒక స్వదేశీ,9 విదేశీ ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 1.03గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ శనివారం మధ్యాహ్నం 3.03గంటలకు ముగిసింది.

ఈ రాకెట్‌ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్‌ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున, లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు.

కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా మరెవ్వరినీ అనుమతించలేదు. పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా..షార్ సెంటర్ నుంచి ఓవరాల్‌గా 76వ ప్రయోగం.

- Advertisement -