ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో

26
- Advertisement -

అంతరిక్షంలో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో స్పాడెక్స్ మిషన్ చారిత్రాత్మక డాకింగ్ విజయాన్ని సాధించింది. 2 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. ఈ ఘనత సాధించిన నాలుగోవ దేశంగా నిలిచింది.

హోల్డ్ పాయింట్ ను 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చే ప్రక్రియ పూర్తయింది. అంతరిక్ష నౌకను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ మిషన్ రెండు మూడు సార్లు వాయిదా పడింది.

అయితే తాజాగా విజయవంతంగా పూర్తి చేసి ఔరా అనిపించింది ఇస్రో. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ మిషన్ అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతదేశ భవిష్యత్ అంతరిక్ష ప్రయత్నాలకు ముఖ్యమైనది. ఇప్పుడు ఈ మిషన్ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4 విజయాన్ని నిర్ణయిస్తుంది.

మానవులను చంద్రుడిపైకి పంపేందుకు కూడా ఈ సాంకేతికత అవసరమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 30న PSLV-C60 రాకెట్ సహాయంతో ఇస్రో ఈ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..

 

- Advertisement -