శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ISRO యొక్క PSLV-C62 మిషన్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘ఈఓఎస్-ఎన్1’ (అన్వేష) భూవీక్షణ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:18 గంటలకు 260 టన్నుల బరువైన PSLV-C62 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగం ప్రారంభమైన తర్వాత తొలి రెండు దశలు సజావుగా పూర్తయ్యాయి. సాధారణంగా ప్రయోగం జరిగిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో స్థిరపడాల్సి ఉండగా, మూడో దశ చివరి దశలో కీలక సాంకేతిక సమస్య ఎదురైనట్లు ఇస్రో ప్రకటించింది. శాటిలైట్‌తో కమ్యూనికేషన్ అకస్మాత్తుగా తెగిపోవడంతో PSLV-C62 మిషన్‌లో అంతరాయం ఏర్పడినట్లు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ నారాయణన్ (నారాయణన్) వెల్లడించారు.
ఈఓఎస్-ఎన్1 ఉపగ్రహం దేశ భద్రత, సరిహద్దుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, భూవీక్షణ అవసరాలకు ఎంతో కీలకమైనది. అందుకే ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం టెలిమెట్రీ డేటాను విశ్లేషిస్తూ, సమస్యకు గల కారణాలను శాస్త్రవేత్తలు గుర్తించే పనిలో ఉన్నారు.
ప్రయోగంలో ఏర్పడిన అంతరాయంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సవాళ్లను విజయవంతంగా అధిగమించిన ఇస్రో, ఈ సమస్యను సైతం సాంకేతికంగా పరిష్కరిస్తుందన్న నమ్మకం శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
Also read:లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!

