2026 సంవత్సరంలో ఇస్రో నిర్వహిస్తున్న తొలి ప్రయోగం PSLV-C62 . ఈ మిషన్‌లో EOS-N1 భూవీక్షణ ఉపగ్రహంతో పాటు 14 సహ ప్రయాణిక ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ప్రత్యేకమైన KID క్యాప్సూల్ రీ-ఎంట్రీ ప్రదర్శన కూడా జరగనుంది.
ISRO వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మిషన్‌లో EOS-N1 భూవీక్షణ ఉపగ్రహం మరియు 14 కో-ప్యాసింజర్ ఉపగ్రహాలను కక్ష్యలో స్థాపించనున్నారు. ఈ 14 ద్వితీయ పేలోడ్లు దేశీయ, అంతర్జాతీయ ఖాతాదారులకు చెందిన విభిన్న ఉపగ్రహాలు కావడం విశేషం.
260 టన్నుల బరువున్న PSLV-C62 రాకెట్ ప్రయోగ సమయాన్ని స్వల్పంగా మారుస్తూ, జనవరి 12 ఉదయం 10:17 గంటల స్థానంలో 10:18 గంటలకు లిఫ్ట్-ఆఫ్‌గా నిర్ణయించారు.
ప్రధాన పేలోడ్‌గా థాయ్‌లాండ్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ కలిసి అభివృద్ధి చేసిన ఆధునిక భూవీక్షణ ఉపగ్రహం EOS-N1ను మొదట కక్ష్యలోకి ప్రవేశపెడతారు. దానితో పాటు మరో 13 ఉపగ్రహాలు ప్రయోగం ప్రారంభమైన సుమారు 17 నిమిషాల్లో సన్-సింక్రోనస్ కక్ష్యను చేరుకుంటాయి. మిషన్ చివరి దశలో కీలకమైన సాంకేతిక ప్రదర్శన జరగనుంది. స్పెయిన్‌కు చెందిన ఒక స్టార్టప్‌కు చెందిన 25 కిలోల బరువైన Kestrel Initial Technology Demonstrator (KID) క్యాప్సూల్‌ను ప్రయోగం జరిగిన రెండు గంటల తర్వాత విడదీయనున్నారు.
దీనికోసం ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ నాలుగో దశ (PS4)ను మళ్లీ ఆన్ చేసి డీ-బూస్ట్ మానువర్ నిర్వహిస్తారు. తద్వారా రీ-ఎంట్రీ మార్గంలోకి దశను మళ్లిస్తారు. అనంతరం విడుదలయ్యే KID క్యాప్సూల్‌తో పాటు PS4 దశ కూడా భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో నియంత్రితంగా సముద్రంలో దిగనుంది.
Also Read;లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!

