ఎల్ఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం..

9
- Advertisement -

నేడే ఎల్ఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. సాయంత్రం 5.26 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగం జరగనుంది.

ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి సీఎంఎస్-03 సమాచార ఉపగ్రహం పంపనున్నారు. ఈ ఉపగ్రహం బరువు 4410 కిలోలు. 16.09 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసి ఉపగ్రహాన్ని కక్ష్యలో దింపనున్నారు శాస్త్రవేత్తలు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరిస్థితులు, సముద్ర తీర ప్రాంతాల్లో సైనిక అవసరాల కోసం ఉపయోగపడనుంది ఈ శాటిలైట్.

Also Read:ఇంకో అవకాశం ఇవ్వండి..నితీశ్ విజ్ఞప్తి

- Advertisement -