నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-48

472
pslv c48
- Advertisement -

ఇస్రో అమ్ములపొదిలో మరో మైలురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ సీ-48ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు.రీశాట్‌-2 బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-48 ద్వారా పంపారు. అమెరికా 6, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉంది.

మంగళవారం సాయంత్రం 4.40కు మొదలైన కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు కొనసాగింది. 628 కిలోల బరువున్న రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. ఐదేండ్లపాటు సేవలందిస్తుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగిస్తున్నారు.

పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగం కాగా.. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కావడం విశేషం.

- Advertisement -