చంద్రయాన్ 3తో అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర సృస్టించింది ఇస్రో. తాజాగా శ్రీహరికోటలోని షార్ వేదికగా పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. భారత దేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ 1. ఇది విజయవంతమైతే భారత్ సూపర్ పవర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ఆదిత్య ఎల్-1 మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. భూమి నుంచి నింగిలోకి 1.5 మిలియన్ కిలోమీటర్లు మేరా ప్రయాణించి లాగ్‌రేంజియన్ పాయింట్ (L1)వద్ద కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇక అక్కడి నుంచి సూర్యడిని స్టడీ చేస్తుంది.
సూర్యుడిపై దాగి ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా పలు దేశాలు సోలార్ మిషన్ లను ప్రయోగిస్తునే ఉన్నాయి. వాటిలో కొన్ని విజయవంతం కాగా.. మరికొన్ని విఫలమయ్యాయి కూడా. ఇప్పుడు చంద్రుడిపై కాలు మోపిన ఇస్రో.. ఈసారి అదే ఊపులో సూర్యుడిపైనా అడుగుపెట్టి ప్రపంచానికి తానేంటో చూపించాలని పట్టుదలగా ఉంది.
Also Read:మళ్లీ నిరాశపర్చిన ప్రభాస్ ‘సలార్’!