Israel war:3 వేల మంది మృతి

25
- Advertisement -

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేలు దాటింది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను కూల్చివేసి వాటిని తన నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఆ దేశానికి పంపింది.

హమాస్ దాడులు దుర్మర్గపు చర్య అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. ఇజ్రాయెల్ కు సంఘీభావంగా ఆ దేశాన్ని సందర్శించనున్నారు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్. ఇజ్రాయెల్ దళాలు గాజాలో తన ప్రతీకార వైమానిక దాడులను కొనసాగించాయి. హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలతో సహా భవనాలను కూల్చివేశాయి.

Also Read:Bigg Boss 7 Telugu:పోటుగాళ్లదే గెలుపు

- Advertisement -